ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి

ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్

ఉట్నూర్‌: ప్రభుత్వ ఆసుపత్రులలో గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పిఓ చాహత్ బాజ్ పాయ్ డాక్టర్లను ఆదేశించారు. బుధవారం ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రి (సి హెచ్ సి) ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. జనరల్ వార్డు, డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు అందిస్తున్న వైద్య చికిత్సలను డాక్టర్లు, రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిఓ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శస్త్ర చికిత్సలు, సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు వైద్య చికిత్సలు అందించుటలో ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని వైద్య సిబ్బందికి సూచించారు. వైద్య చికిత్సలు అందించుటలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్బంగా పిఓ వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఉపేందర్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.