ప్రతీ మొక్క బ్రతకాలి.. పచ్చదనం పెంపొందాలి
శ్రీరాంపూర్ ఏరియా జిఎం సంజీవరెడ్డి

మంచిర్యాల: ప్రతీ మొక్క బ్రతకాలి.. పచ్చదనం పెంపొందాలని శ్రీరాంపూర్ ఏరియా జిఎం సంజీవరెడ్డి అన్నారు.శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 ఇంక్లైన్ గని లో హరితహారంలో భాగంగా బలరాంవనంలో గని మేనేజర్ అబ్దుల్ ఖదార్ తో కలిసి శ్రీరాంపూర్ ఏరియా జిఎం సంజీవరెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. మానవ మనుగడకు మొక్కలు ఆధారమని, వాటిని పెంచి పర్యావరణ సమతుల్యకత్వం ప్రతి ఒక్కరు తోడ్పడాలన్నారు. ఆహారం, దుస్తులు, నివాసం తో పాటు మానవ కోటికి ప్రాణ వాయువు అయినటువంటి ఆక్సిజన్ కూడా ఎంతో అవసరమన్నారు.ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయన్నారు.అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏజెంట్ జి వి రెడ్డి,, అధికారులు, కార్మికులు,యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.