ప్రజా విశ్వాసం చూరగొన్న బిజెపి మోడీ ప్రభుత్వం..
బిజెపి ఇంటింటి ప్రచార కార్యక్రమంలోరాష్ట్రకార్యవర్గసభ్యులు నల్ల రత్నాకర్ రెడ్డి..

తలమడుగు: కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనతో ప్రజల విశ్వాసం చూరగొన్నదని , ప్రధాని మోదీ సుపరిపాలన కు ప్రజలంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల రత్నాకర్ రెడ్డి, తెలిపారు. మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రాం లోభాగంగా 9 ఏళ్లలో బిజెపి మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలు , సుపరిపాలనను తెలియజేయడానికి చేపట్టిన ఇంటింటికి బిజెపి ప్రోగ్రాంని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల రత్నాకర్ రెడ్డి తలమడుగు మండలంలోని తల మడుగు,సాయి లింగి,సుంకిడి మరియు ఉమ్ డం గ్రామాల పోలింగ్ బూత్ ల లో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. పోలింగ్ బూత్ పరిధిలోని గడపగడపకు వెళ్లి మోడీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలన ప్రగతికి సంబంధించిన కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి మోడీ ప్రభుత్వం దేశ హితం కోసం అనుక్షణం ఆలోచన చేస్తుందన్నారు. ఆదిశగానే 9 ఏళ్ల పాలనలో చారిత్రక సాహసోపేత నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకుందని , ఆ పాలన నిర్ణయాలు నేడు దేశ దిశ దశ ల ను మార్చిందని , ప్రపంచంలోని అగ్రరాజ్యాల వరుసలో భారతదేశం కూడా నిలిచిందన్నారు. మోడీ ప్రభుత్వ పాలన తీరును ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, దీంతో దేశం కీర్తి విశ్వంలో మారుమోగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల నిధులు వెచ్చించిందన్నారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అన్ని రంగాలను బలోపేతం చేయడానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. అందుకే ఇంటింటికి బిజెపి ప్రోగ్రాం ద్వారా గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటే బిజెపి మోడీ ప్రభుత్వ 9 ఏళ్ల సుపరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని, ప్రధాని మోడీ కి తమ సంపూర్ణ మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భువనగిరి స్వామి,కిరణ్, ధనంజయ,మనోహర్ రెడ్డి,శ్రీకాంత్, ప్రభాస్,రవి, కైలాస్, నవీన్, అశోక్, వన్నెల లక్షమన,శేషి కాంత యాదవ్,నరేందర్, ప్రవీణ్, ఉషా న్న,తదితరులు పాల్గొన్నారు.