ప్రజల చూపు కాంగ్రెస్ వైపు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్

ఇచ్చోడ:రాజకీయ పరిణామాల నేపధ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ జోస్యం చెప్పారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన లీడర్ షీప్ డెవలప్ మెంట్ మిషన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రజాకర్షక పథకాలను వరంగల్ రైతు డిక్లరేషన్రా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ను ప్రతి గడపగడపకు చేర్చాలని, బేధాభిప్రాయాలు మాని కార్యకర్తలు అంతా కలిసికట్టుగా కర్ణాటక తరహాలో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని రాబోవు రోజుల్లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపడుతున్నట్లు, 100 సమస్యలతో, టిఆర్ఎస్ పార్టీ అక్రమాలపై ప్రజల ముందు చార్జీషిట్ ఉంచుతామని, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల వైఫల్యాలను ప్రజలలో ఎండగడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పసుల చంటి, బోథ్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్, అదిలాబాద్ పార్లమెంట్ నాయకులు నరేష్ జాదవ్, మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిమద్ ఖాన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సేవాదళ్ సోషల్ మీడియా ఫిషరీస్ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన వివిధ ప్రజా సంఘాల జిల్లా అధ్యక్షులు బోథ్ నియోజకవర్గ 9 మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు