ప్రచారానికి ఆటంకం కలిగిస్తే సహించం

ఆదిలాబాద్ : కిరాయి మనుషుల చేత గొడవ చేయించాలని చూస్తే సహించేది లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే జోగురామన్నను హెచ్చరించారు. ఆదిలాబాద్ బంగారి గూడ లో గడప గడప కు కాంగ్రెస్ బస్తీబస్తీకి కంది శ్రీనన్న కార్యక్రమం లో గలాట సృష్టించేందుకు ప్రయత్నించడంతో ఆయన మండి పడ్డారు.ముందుగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. గడప గడప తిరిగి కాంగ్రెస్ డిక్లరేషన్ల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటికీ కరపత్రాలు పంచి పెట్టారు.అనంతరం కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో బంగారి గూడ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు.వారందరికీ కండువా కప్పి కంది శ్రీనివాస రెడ్డి పార్టీలోకిఆహ్వానించారు.జోగు రామన్న ఓట్ల కోసం వస్తే ఖచ్చితంగా నిలదీస్తామన్నారు స్థానికులు.కార్యక్రమాన్ని భగ్నం చేసే కుట్రల పట్ల కంది శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే జోగు రామన్న కిరాయి మనుషులకు గుర్తు పెట్టుకుని తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారని ఎందుకంత కుళ్లు అని జోగు రామన్నను ఉద్దేశించి ప్రశ్నించారు.బంగారి గూడ నీ ఒక్కడిదే కాదని ఇక్కడ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని కోరారు. బంగారు గూడలో ట్యాక్స్ లు కడుతున్నరు ఇండ్లు వచ్చినవా ఒక్కరికన్నా అని సూటిగా ప్రశ్నించారు.గతంలో ఇండ్లు ఇచ్చింది ,ఇంటి జాగాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఇక్కడ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు , పెన్షన్లు లేవు,రేషన్ కార్డులు లేవు మరి ఏం ఇన్నేళ్లు ఏం చేసినవ్ జోగు రామన్నా అని నిలదీసారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఏమేం చేస్తుందో వివరించారు.తనకు ఓ అవకాశమివ్వండి బంగారి గూడ ను నిజమైన బంగారు గూడగామారుస్తానని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.జోగు రామన్నకు నాలుగు సార్లు అవకాశమిచ్చారని ,కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశమివ్వండని కోరారు.అనంతరం స్థానిక నాయకులు నిర్వహించిన అన్నదానంలో పాల్గొని కాలనీ వాసులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో గీమ్మ సంతోష్, నాగర్కర్ శంకర్, సంతోష్ రెడ్డి, కిష్టా రెడ్డి, అల్లూరి అశోక్ రెడ్డి, పుండ్రు రవి కిరణ్ రెడ్డి, దీపక్ రావు, చిత్రు, మదర్ మై ఉద్దీన్, భీమ్ రావు పటేల్, గోలి వెంకటి, దర్శనాల చంటి, ఎల్మా రామ్ రెడ్డి, ఓసావర్ సురేష్, శంకర్, ప్రభాకర్ రావు, చాన్ పాషా, ఎల్మా గంగా రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.