ప్రగతి అంచనాలను సిద్ధం చేయడంలో ప్రణాళిక అధికారుల పాత్ర కీలకం
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఆదిలాబాద్:అభివృద్ధి, సాధించిన ప్రగతి అంచనాలను విశ్లేషించి సిద్ధం చేయడంలో ప్రణాళిక అధికారుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా జిల్లా గణాంక దర్శిని – 2022 ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంచనాలను తయారు చేయడంలో కీలక పాత్రను పొషిస్తున్నటువంటి మండల, జిల్లా గణాంక అధికారులందరు సమాచార సేకరణ, వాటిని విశ్లేషించడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణాంక దర్శిని లో జనాభా, వాతావరణం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, విద్యా, రవాణా, సమాచారం, బ్యాంకింగ్ వంటి వివరాలను పొందుపరచడం జరిగిందని తెలిపారు. సమగ్ర వివరాలను పొందుపరిచిన గణాంక అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి బి. వెంకటరమణ, ఉప గణాంక అధికారి శ్రీనివాస్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.