పునరావాసం కల్పించాలని కలెక్టర్ కు వినతి

రెబ్బెన: మండలం పాత మాధవాయి గూడ గ్రామంలో నివసించే 25 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని రెబ్బెన ఎంపీపీ సౌందర్య ఆనంద్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు,కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావుకు గురువారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వర్షకాలంలో పెద్దవాగు నీటి ప్రవాహం వలన పాత మాధవాయి గూడలో నివసించే సుమారు 25 కుటుంబాలకు చెందిన ఇండ్లలో కి నీరు వస్తుండడంతో బాధిత కుటుంబాలు భయం భయం తో జీవిస్తున్నారని,వారికి. పునరావాసం కల్పించాలని కలెక్టర్ కు విన్నవించినట్లు తెలిపారు.సమస్యపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.