పండ్ల తోటల సాగుపై దృష్టి పెట్టాలి
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చాహత్ భాజ్ పాయ్

ఉట్నూర్: గిరిజన రైతులు పండ్ల తోటలు సాగు చేసి , ఆర్థికంగా లబ్ధి పొందాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్ భాజ్పాయ్ తెలిపారు. బుధవారం ఉట్నూరు మండలంలోని జి ఆర్ నగర్ ,కొత్తగూడ గ్రామాలలో రైతులు సాగు చేస్తున్న మామిడి తోటలను ఐటీడీఏ ప్రాజెక్టు హార్టికల్చర్ అధికారి గుడిమల్ల సందీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. పంట సాగు వివరాలను , ఆదాయ వ్యాయాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు అంతర పంటగా పెసర , కంది , మునగ , మినుము వంటి పంటల సాగు చేపట్టి అధిక ఆదాయాన్ని పొందాలని ఈ సందర్భంగా సూచించారు. రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న వానపాముల ఎరువుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఓ సందీప్ కుమార్ , హెచ్ ఓ శ్రీధర్ కుమార్ , సిపిఎఫ్ సంస్థ ప్రతినిధులు సత్య , రవి , మంగ , న్యాను రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు .