పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్.

రెబ్బెన,:గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి11వ పి ఆర్సి ప్రకారం కనీస వేతనం19వేలు ఇవ్వాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 5వ రోజు సందర్భంగా రెబ్బెన మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51ని వెంటనే సవరించాలని,మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల సమ్మె 5 రోజులు కావస్తున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తుందని, న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గ్రామపంచాయతీ కార్మికులు అలుపెరుగని పోరాటం చేశారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను గుర్తించి పర్మిట్ చేయాలన్నారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎన్ సుధాకర్,రమేష్,వెంకటేష్,శ్రీనివాస్, లక్ష్మి,వెంకటేష్, దేవాజి,లక్ష్మి,మహేందర్,తో పాటు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.