న్యూయార్క్ రాహుల్ స‌భ‌లో పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డి

ఆదిలాబాద్ : అమెరికా లోని న్యూయార్క్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ‌రిగిన రాహుల్ గాంధీ సభ సూపర్ సక్సెస్ అయ్యింది.ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ర్యాలీ లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నినాదాలు హోరెత్తాయి. పార్టీ ఆదేశాల నేపథ్యంలో సభ సన్నాహాల కోసం అమెరికా వెళ్ళిన కంది శ్రీనివాసరెడ్డి తీసుకెళ్లిన జెండాలు, ప్రచారసామాగ్రి స్పెషల్ ఎట్రాక్షన్ గా మారాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి సభలో పాల్గొన్నారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీగా తెలుగు ప్రజలను సమీకరించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌లో క‌ర్నాట‌క మాదిరిగానే ఫ‌లితాలుంటాయ‌ని రాహుల్ గాంధీ ధీమా వ్య‌క్తం చేసారు.ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ‌లో చూద్దామ‌న్నా బీజేపీ ఉండ‌ద‌న్నారు. భారత్ లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు సహకరించాలని భారతీయ అమెరికన్లకు రాహుల్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.