నీటి కోసం రోడ్డెక్కిన ఆదివాసీ గిరిజనులు.

తిర్యాని:మండలంలోని దేవాయిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని గోవుర్ గూడ కొలం ఆదివాసి గిరిజనులు తమ గూడానికి మంచినీళ్లు రావడంలేదని శనివారం కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో కూర్చొని ధర్నా నిర్వహించడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి సింగరేణి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.తమ ఏకైక డిమాండ్ మంచినీళ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరిమిస్తామని గ్రామస్తులు ససేమిరా అనడంతో,చేసేదేమీ లేక సింగరేణి అధికారులు గ్రామస్తులకు అతి త్వరలో నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.