నిబద్ధతతో పనిచేసి సంస్థకు,కుటుంబ ఎదుగుదలకు కృషి చేయాలి.

బెల్లంపల్లి ఏరియా గోలేటి జిఎం కార్యాలయంలో బుధవారం జిఎం జి దేవేందర్ ఇద్దరు పిడిఎఫ్ లకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఉద్యోగం దొరకడం అదృష్టమని అన్నారు.కొత్తగా ఉద్యోగంలో చేరే యువతి యువకులు నిబద్ధతతో పనిచేసి సంస్థకు వారి కుటుంబ ఎదుగుదలకు కృషి చేయాలన్నారు.విధులకు గైర్హాజరు కాకుండా,అధికారుల సూచనలు,ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించి ఉత్తమ ఉద్యోగులుగా పేరు తెచ్చుకోవాలని అన్నారు.కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం కేహెచ్ఎన్ గుప్తా,టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాసరావు,పర్సనల్ మేనేజర్ ఐ లక్ష్మణరావు, డివైపిఎం రెడ్డి మల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.