నవోదయ సాధించిన విద్యార్థులకు సన్మానం

కాగ‌జ్‌న‌గ‌ర్‌: జన్నారం మండల కేంద్రంలోని స్లేట్ ఆంగ్లం పాఠశాలలో నవోదయ సీట్లు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం రోజున మండల కేంద్రంలోని స్లేట్ ఆంగ్లము పాఠశాలలో 2023 24 సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో నవోదయ సీట్లు సాధించిన పాఠశాల లోని విద్యార్థులను వారి తల్లిదండ్రులను పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 2009 నుండి మా పాఠశాలలోని విద్యార్థులు నవోదయ సీటు సాధించినట్లయితే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానిస్తున్నామని దానిలో భాగంగానే ఈ సంవత్సరం నవోదయ సీట్లు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఈరోజు సన్మానించడం జరిగిందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పొనకల్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పూజ ఉపాధ్యాయులు రంజిత్ శైజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.