దశాబ్ది ఉత్సవాల పేరిట దుబారా ఖర్చు

ఏఐసిసి సభ్యుడు నరేష్ జాదవ్

గుడిహత్నూర్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వం ప్రజల సొమ్మును దుబారా ఖర్చు చేస్తుందని ఏఐసిసి సభ్యుడు నరేష్ జాదవ్ మండిపడ్డారు. చెరువుల నుంచి నియోజకవర్గం లో ఒక్క ఎకరాన్ని కూడా నీరు పారకుండా కాలువలు నిర్మించకుండా చెరువులు పండుగ ఎలా చేస్తారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభం కాకుండానే నీటీవారోత్సవాల పేరిట సంబరాలు ఎలా జరుపుకుంటారని, కుప్టి, పిప్పల్ కోటి, గోమూత్రి ప్రాజేక్టుల నిర్మాణం ఎక్కడ వరకు వచ్చిందని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో సబ్బండవర్గాలకు ఎటువంటి అభివృద్ది చేయకుండా ఏవిధంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేయకుండా పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ రైతు ప్రభుత్వంగా ఎలా చెప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు యువశక్తిని మెల్కోలిపె దిశగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ ప్లీజ్ పోటీలపై ప్రచారం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్యాల కరుణాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగనాథ్ అప్పాఆరిఫ్ ఖాన్, గోవింద్ , రమేష్ కోట్నాక్, ప్రేమ్, కపిల్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.