త్వరితగతిన రోడ్డు పనులను పూర్తి చేయాలి

ఇంద్రవెల్లి:మండల కేంద్ర రోడ్డు వెడల్పుకొరకు నిధులు విడుదలైనప్పటికి రోడ్డు నిర్మాణ పనులు చేపట్ట కుండా జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆర్టిఐ ఎండి జుబీర్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గురువారం ఇంద్రవెల్లి ప్రెస్ క్లబ్ సమావేశంలో మాట్లాడారు ప్రమాదాలను నివారించేందుకు సిఎం కార్యాలయానికి సమర్పించిన పిటిషన్ పై గత కలెక్టర్ సిక్త పట్నాయక్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించినప్పటికి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. గతంలో తాను రోడ్డు వెడల్పు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వేసిన అర్టిఐ పై సిఎం గత జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కు సమగ్ర విచారణ జరిపి పనులను చేపట్టాలని ఆదేశించారన్నారు.కానీ అర్.అండ్.బి అధికారులు సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు ఏలాంటి పనులను చేపట్టాలేదని వాపోయారు.నిధులు మంజూరు అయినప్పటికీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో చెప్పాలనీ ప్రశ్నించారు. త్వరితగతిన పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 8 సంవత్సరాలలో 20 పైగా మంది చనిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు కాంబ్లే అతిష్,ఉపాధ్యక్షుడు భాలేరావు భాస్

Leave A Reply

Your email address will not be published.