తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన గొప్ప పథకం న్యూట్రిషన్ కిట్

జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్

ఆదిలాబాద్, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే ప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన గొప్ప పథకం న్యూట్రిషన్ కిట్ అని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుక ఉత్సవాలలో భాగంగా స్థానిక జనార్దన్ రెడ్డి గార్డెన్ లో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా జిల్లాలో వైద్యారోగ్య శాఖ ప్రగతి నివేదికను, రిమ్స్ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ లు వివరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణలో పుట్టబోయే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, గర్భిణీ మహిళల రక్తహీనతను అరికట్టడానికి హార్లిక్స్, ఐరన్, సిరప్, ఖర్జూరం, నెయ్యి, పల్లి చిక్కి, హర్లిక్స్, త్రాగడానికి కప్పు, వస్తువులను అమర్చుకోడానికి బాస్కెట్ లాంటి 3వేల విలువగల న్యూట్రిషన్ కిట్ లను అందించడం జరుగుతుందన్నారు. ప్రయివేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించడంతో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. తెలంగాణా సాధించుకున్న తరువాత విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. మాట్లాడుతూ, ఆరోగ్య ఆదిలాబాదు జిల్లాగా తీర్చి దిద్దెందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ -2 నుండి 22 వరకు వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరుగుతుందని, ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.