తహసిల్దార్ కార్యాలయం ఎదుట‌ గౌడ గీతా కార్మికుల ధర్నా

రెబ్బెన, రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం ముందు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం గౌడ కులస్తులు బీసీలకు కల్పిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సహాయం తమకూ కల్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు.అనంతరం తహసిల్దార్ మల్లికార్జున్ కు వినతిపత్రం సమర్పించారు.కార్యక్రమంలో భాగంగా మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ పొట్ట కూటి కోసం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఆకాశమంత తాటి. ఈత చెట్లు ఎక్కే గౌడ గీత కార్మికులకు బిసి కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం గౌడ కులానికి వర్తింప చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్యఅని అన్నారు.ఈనెల12న గ్రీవెన్స్ డే రోజున అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టి కలెక్టర్ల కు వినతి పత్రాలు ఇవ్వాలని మోకు దెబ్బ పిలుపునిస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.