డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సత్కరించిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రిమ్స్ లో విధులు నిర్వహిస్తున్న పలువురు వైద్యులను శనివారం ఆయన ఘనంగా సత్కరించారు. వైద్యులను శాలువా, పుష్పగుచ్చలతో సత్కరించి వారు అందిస్తున్న సేవల పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ… ప్రజలకు సకాలంలో వైద్యం అందిస్తూ వారిని వ్యాధుల బారి నుండి కాపాడుతున్న వైద్యుల సేవలు ప్రశంసనీయమని అన్నారు. రోగులకు భరోసా కల్పిస్తూ వైద్య చికిత్సలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ వైద్యులు అందించిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు.