జోగు ఆశన్న స్మారకార్థం అన్నదానం చేసిన ఎమ్మెల్యే.

ఆదిలాబాద్: రిమ్స్లో వైద్య చికిత్సల నిమిత్తం వచ్చే రోగుల సహాయకులకు భోజన వసతిని కల్పించి వారికి అండగా నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గల సత్యసాయి నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా చేపట్టే అన్నదాన కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే తండ్రి జోగు ఆశన్న జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించారు. ముందుగ సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక హారతులు అందచేసిన అనంతరం అన్నదానం ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా రోగుల సహాయకులకు వడ్డించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూగత పన్నెండు సంవత్సరాలుగా రోగుల సహాయకులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఈ సదుపాయం సాంత్వన ఇస్తోందని పేర్కొన్నారు. సత్యసాయి నిత్యాన్నదాన ట్రస్ట్ సభ్యులకు తమ వంతుగా పూర్తి సహకారం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.బండారి సతీష్, రాజు పాల్గొన్నారు.