జిల్లా ప్రజల రుణం తీర్చుకోడానికే స్వచ్చంద పదవి విరమణ

అజ్మీరా శ్యాం నాయక్

ఆదిలాబాద్: పేద కుటుంబం నుండి వచ్చిన తనను అక్కున చేర్చుకుని జీవితంలో ఉన్నతంగా నిలబెట్టిన జిల్లా ప్రజల రుణం తీర్చుకోడానికే స్వచ్చంద పదవి విరమణ తీసుకుంటున్నానని, ఇకపై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని అజ్మీరా శ్యాం నాయక్ స్పష్టం చేశారు. జిల్లా రవాణా శాఖాదికరిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. స్వచ్చంద పదవి విరమణ తీసుకున్న నేపథ్యంలో శుక్రవారం స్థానిక టీఎన్‌జీఓస్‌ భవన్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున హాజరై ఆయనను శాలువా, పుష్పగుచ్చలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ… విధి నిర్వహణలో ఆయన చూపిన అంకిత భావం, చిత్తశుద్ధి ప్రతి ఒక్కరికి స్పూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర, జిల్లా నాయకులూ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు అజ్మీరా శ్యాం నాయక్ మాట్లాడుతూ… ప్రజాసేవకు పునరంకితం కావాలన్న ఏకైక ఉద్దేశంతోనే స్వచ్చంద పదవి విరమణ తీసుకున్నానని తెలిపారు. దేశ మహనీయుల జీవిత చరిత్రలను స్పూర్తిగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడుస్తానని పేర్కొన్నారు. తన ఉద్యోగకాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తోటి ఉద్యోగులు, సంఘం ప్రతినిధులతో సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకున్న ఆయన.. తనకు మద్దతుగా నిలవడం పట్ల ధన్యవాదాలు తెలియచేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సమాజానికి తన వంతుగా సహాయం చేయాలన్న తలంపుతోనే ఇకపై ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కృష్ణ యాదవ్ , అదిలాబాద్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి వనజ , అసోసియేట్ అధ్యక్షులు కాoడ్లి శివ కుమార్, ఎంజీల రెడ్డి, వెంకటయ్య, రాజేందర్ దేశ్పండ్, టీఎన్‌జీఓస్ యూనియన్ అధ్యక్షులు సంద అశోక్, ప్రధాన కార్యదర్శి ఎడ్ల నవీన్ కుమార్, తిర్మల్ రెడ్డి, నాల్గవ తరగతి అధ్యక్షులు కె గంగాధర్, గోపి, ప్రవీణ్, మహేందర్, గంగాధర్, దత్తు, సుజాత, రాధ,సంతోష్, పార్త సారథి, పసుల ప్రతాప్ తదితరులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.