జిల్లా ట్రెజరీ శాఖ డీడికీ టీఎన్జీవోస్ యూనియన్ అధ్వర్యంలో స‌న్మానం

ఆదిలాబాద్: ఇటీవల జిల్లా ట్రెజరీ శాఖ డీడిగా బాధ్యతలు స్వీకరించిన యన్. హారిక ను అదిలాబాద్ టీఎన్జీవోస్ యూనియన్ అధ్వర్యంలో సభ్యులు బుధవారం ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరయ్య విధంగా కృషి చేయాలని కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు టీఎన్జీవోస్ యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు సంద అశోక్ , ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్, తిర్మల్ రెడ్డి, గోపి, రాజేశ్వర్ , చంద్ర మోహన్ , ప్రవీణ్, గంగాధర్ , నారాయణ, అర్బ‌న్‌ యూనిట్ అధ్యక్షులు మహేందర్, సుజాత, స్రవంతి, అన్నపూర్ణ , సబ్ ట్రెజరీ అధికారి రమణ చారీ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.