జిల్లాలో తీరని సాగునీటి కష్టాలు

బీజేపీ శ్రేణులు చనాక కోరాట ప్రాజెక్టు సందర్శన

జైన‌థ్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు.జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు వాటి కెనాల్ పిల్లకాలోల నిర్మాణం పూర్తికాకుండానే సాగునీటి వారోత్సవాల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం అధికార పార్టీ నేతలు సాగునీటి వారోత్సవాలు నిర్వహించడం హాస్య‌స్పదంగా ఉందని అన్నారు. టిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు సాగునీటి వారోత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో గత 2015 సంవత్సరం నుంచి జైన‌థ్‌ మండలంలోని చనాక కోర‌ట ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎక్కడ పూర్తి చేశారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులతో కలిసి చనాకకోట ప్రాజెక్టును గురువారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నియోజకవర్గంలోని జైనథ్ మండలంలో చేపడుతున్న జనాక కోట ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు పిల్ల కాలువలు పూర్తి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.సందర్శించిన వారిలో కోరటా సర్పంచ్ మయూర్ జాకాటే, ఉపసర్పంచ్ శేఖర్ ,కటకం రాందాస్, రతన్ రెడ్డి,వెంకన్న, కరుణాకర్ రెడ్డి ,ఎంపీటీసీ భూపేందర్ ,రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.