జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి
మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్

ఆదిలాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ ను కలిసి సమస్యలపై వినతిపత్రాన్ని అందచేశారు. చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ జహీర్ రంజానికి తమ సమస్యలను వివరించారు. . ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ మాట్లాడుతూ… పలు సమస్యలను ప్రస్తావిస్తూ ఉర్దూ జర్నలిస్టులు అందించిన వినతిని ఎమ్మెల్యే జోగురామన్న దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. పాత్రికేయులు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని భరోసా కల్పించారు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని మాట్లాడుతూ… ఎమ్మెల్యే సహకారంతో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు షాహిద్ అహ్మద్ తవక్కల్, గౌరవ అధ్యక్షులు మెహబూబ్ ఖాన్, గౌరవ ఉపాధ్యక్షులు హమీదుల్లా అన్వర్, ప్రధాన కార్యదర్శి ఖిజర్ అహ్మద్ యాఫై, సంస్థ కార్యదర్శి అమీమ్ షరీఫ్, కోశాధికారి ఆస్మత్ అలీ, క్రియాశీల సభ్యుడు ముహమ్మద్ షఫీ, వైస్ ప్రెసిడెంట్ ముహమ్మద్ ఆసిఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.