జన హృదయ విజేత వైఎస్ రాజశేఖర రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆడే వసంతరావు

నేరడిగొండ : మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతినీ నేరడిగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆడే వసంతరావు ఆధ్వర్యంలో నేరడిగొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనహృదయ విజేత,దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన సంక్షేమ పథకలతో ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన మహోన్నత నాయకుడు అని తన పాలనా కాలంలో రైతుల అభ్యున్నతి కి కృషి చేసిన రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి అని ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నంతకాలం ఆయన ఎల్లవేళలా రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి సద్దాం, జిల్లా నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ వకీల్ ,పిఎసిఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి , మురళి, గౌడ్, నిశాంత్ నాయకులు పాల్గొన్నారు.