ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన అమరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్, అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన ఉద్యమ సమయంలో చేసిన సేవలను కొనియాడారు. అమరుల త్యాగలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ గుర్తుచేసుకుంటూన్నమని అన్నారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అమరుల త్యాగాలను స్మరించుకోవడం కోసం జయంతి, వర్ధంతి కార్యక్రమాలని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్ రమేష్, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరవింద్ కుమార్, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి రాజలింగం, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, బిసి సంఘం నాయకులు చిక్కాల దత్తు, శంకర్, అనసూయ, ఉమా మహేశ్వరి, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.