గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

ఆదిలాబాద్. శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గ్రూప్ వన్ పరీక్షా కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న బందోబస్తు అధికారులతో సిబ్బందితో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివారం జిల్లా కేంద్రం నందు 19 పరీక్షా కేంద్రాలలో 6190 అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షను రాయనన్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల బయటి బందోబస్తు ప్రక్రియ పోలీసు శాఖ ద్వారా నిర్వహించబడుతుందని, అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా పరీక్షను పూర్తి అయ్యేవిధంగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయాన్నే పరీక్షా కేంద్రాల పూర్తి తనిఖీ నిర్వహించి ఇతరులు ఎవరూ పరీక్షా కేంద్రంలో ఉండకుండా చూసుకోవాలని సూచించారు.