గ్రామ పారిశుద్ధ కార్మికుల గోడు పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వం
బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్

జైనథ్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ గతంలో వారికి హామీ ఇచ్చి ప్రస్తుతం గ్రామ పారిశుద్ధ్య కార్మికుల గోడు పట్టించుకోని బిఆర్ఎస్ అసమర్థ ప్రభుత్వమని బిజెపి పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మండల కేంద్రమైన జైనథ్లో గ్రామ పారిశుద్ధ కార్మికులకు సోమవారం తన సంపూర్ణ మద్దతు తెలిపి దీక్షలో కూర్చుని తమకు సంఘీభావాన్నీ వ్యక్తం చేసి కార్మికులతో మాట్లాడారు. బ్రతకడానికి విధులు నిర్వహిస్తున్న గ్రామకార్మికులకు నెల నెల జీతాలు ఇవ్వలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. కానీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు నెలనెల జీతాలు తీసుకుంటన్నారని విమర్శించారు. గ్రామ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు కే శివయ్య , నార కట్ల ప్రతాప్ యాదవ్ , జి సత్యనారాయణ ,ఎల్ రమేష్ యాదవ్ లతోపాటు జైనథ్ మండల గ్రామ కార్మికులు ఉన్నారు.