గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలి
డిడి దిలీప్ కుమార్

ఉట్నూర: గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిడి దిలీప్ కుమార్ అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గిరిజన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలను సమర్పించారు. తిర్యాణి మండలం మంగి గ్రామానికి చెందిన కుమ్ర ఇంటర్మీడియట్ లో సీట్ ఇప్పించాలని, ఉట్నూర్ మండలం బిర్సాయి పేట్ గ్రామానికి చెందిన సిహెచ్ జైతు ఆర్ ఓ ఎఫ్ఆర్ పట్టా మంజూరు చేయాలని, తలమడుగు మండలం నందిగామ గ్రామానికి చెందిన ఆత్రం మోతిరాం ఎడ్లజత కొరకు అర్జీ కోరారు, ఉట్నూర్ మండలం ఉమాపతిగూడా గ్రామం మంగం సంగీత ఆశవర్కర్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఫించను, రెండు పడక గదుల ఇండ్లు, ఆశ్రమ పాఠశాలలలో ప్రవేశాలు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటు ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణిలో ఎపిఓ కనక భీంరావు , ఏడి యం&హెచ్ ఓ కుమ్ర బాలు, ఐ టి డి ఏ ఏఓ రాంబాబు, ఎపిఓ పివిటిజి ఆత్రం భాస్కర్, పి ఎచ్ఓ సందీప్, జెడిఎం నాగభూషణం, ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్ డిపిఓ ప్రవీణ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.