గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి తొందరగా చర్యలు చేపట్టాలి
ఐటిడిఏ పిఓ చాహత్ భాజ్పాయ్

ఉట్నూర్ గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గిరిజన ప్రజల సమస్యల అర్జీల దరఖాస్తులను ఆమె స్వీయకరించారు. కెరమెరి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కోట్నక్ విజయ్ తనకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలనీ, గుడిహత్నూర్ మండలం న్యూ సోమార్ పేట్ గ్రామస్థులు తమ గ్రామానికి రోడ్డును మంజూరు చేయాలనీ, దస్తురాబాద్ మండలం మున్యమ్ గ్రామానికి చెందిన భూక్యా వంశీ తనకు స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం మంజూరు చేయాలనీ, నెన్నెల మండలం ధమ్మిరెడ్డి గ్రామస్థులు తమకు ఆర్ ఓ యాప్ ఆర్ హక్కు పత్రాలను మంజూరు చేయాలనీ కోరారు. ఫించను, రెండు పడక గదుల ఇండ్లు, ఆశ్రమ పాఠశాలలలో ప్రవేశాలు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటు ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణిలో శిక్షణ సహాయ కలెక్టర్ పి. శ్రీజ, డిడి దిలీప్ కుమార్, ఎపిఓ కనక భీంరావు, ఏడి యం &హెచ్ ఓ కుమ్ర బాలు, ఏఓ రాంబాబు, ఎపిఓ పివిటిజి ఆత్రం భాస్కర్, పి ఎచ్ఓ సందీప్, జెడిఎం నాగభూషణం, ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్ డిపిఓ ప్రవీణ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.