గాలివాన బీభత్సం…
కూలిన పూరి గుడిసె.

రెబ్బెన మండలం పులి కుంట గ్రామపంచాయతీ పరిధిలోని రోడ్డు పులికుంట వాడలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం,గాలి వలన ఇండ్ల మల్లేష్ కు చెందిన పూరి గుడిసె పూర్తిగా కూలిపోయింది.ఇల్లు కూలిపోవడంతో బాధితుడు ఇండ్ల మల్లేష్ కుటుంబం నిరాశ్రయులయ్యారు.ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటుంది.