గడప గడపకు కాంగ్రెస్ పార్టీ వాల్ పోస్టర్లు విడుదల

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రివర్యులు సి. రామచంద్ర రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశం మాజీ మంత్రి సి.రామచంద్ర రెడ్డి అధ్యక్షతన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ వాల్ పోస్టర్లను కరపత్రలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి సభ్యులు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటు వంటి డిక్లరేషన్స్ ను ప్రతి గడపకు చేరేవిధంగా వెళ్తున్నాము అని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గం గెలుస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అదిలాబాద్ మాజీ మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, కౌన్సిలర్ అంబకంటి అశోక్ , బోథ్ నియోజకవర్గ నాయకులు జాదవ్ వసంత్ రావు, ఇచ్చోడా మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ నాగనాథ్, గుడి హత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్యాల కరుణాకర్, ఇచ్చోడ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఖాన్,. భీంపూర్ మండల నాయకులు రమేష్, సుదర్శన్ గుడి హత్నూర్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సలీం గారు,నాయకులు గణేష్,జంగు, గజనంద్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు