ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ కు సన్మానం

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని జిల్లా ఖజానా కార్యాలయంలో నూతనంగా జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ .హారిక బాధ్యత స్వీకరించిన సందర్భంగా మాదిగ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పెంటపర్తి ఊశన్న, సేర్ల చిన్నయ్య, కొల్లూరి శంకర్, దత్తు, కత్తి సంతోష్, బిక్క గంగయ్య,రాజు మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ అధ్యక్షులు దర్శనల నగేష్ తదితరులు పాల్గొన్నారు.