క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు

జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి బి.శ్రీకాంత్ రెడ్డి

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హకీంపేట్-ఆదిలాబాద్, కరీంనగర్ క్రీడా పాఠశాలలలో 4, 5 తరగతులలో ప్రవేశాల కొరకు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడాల శాఖ అధికారి బి.శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు ప్రతి తరగతికి 20 మంది బాలురు, 20 మంది బాలికలను పంపించడం జరుగుతుందని, మండల స్థాయి ఎంపిక పోటీలు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 4వ తరగతి కొరకు అభ్యర్థులు 2014 సెప్టెంబర్ 1 నుండి 2017 ఆగస్టు 31, 5వ తరగతి కొరకు అభ్యర్థులు 2013 సెప్టెంబర్ 1 నుండి 2014 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలని, మండల స్థాయిలో ఎంపికలు జూలై 1 నుండి 5వ వరకు నిర్వహించడం జరుగుతుందని, మండల స్థాయిలో ఎంపికైన అభ్యర్థులకు జూలై 12, 13 తేదీలలో జిల్లాస్థాయి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. మండల స్థాయిలో ప్రతి తరగతికి 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేసి, జిల్లాస్థాయిలో ప్రతి తరగతికి 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందని, జూలై 25వ తేదీన రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని, 24వ తేదీలోగా రాష్ట్రస్థాయిలో పేరు నమోదు చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. మండల, జిల్లాస్థాయి పోటీలకు అభ్యర్థులు తాము చదువుతున్న పాఠశాల నుండి వయసు, విద్యార్హత ధ్రువపత్రాలు, జనన ధ్రువీకరణ పత్రం, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అభ్యర్థులు ఆయా తరగతుల ప్రోగ్రెస్ రిపోర్టులు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం ఒరిజినల్స్ తో పాటు ఒక జత జిరాక్స్ ప్రజలను తీసుకురావాలని తెలిపారు. జిల్లా, రాష్ట్రస్థాయి ఎంపిక కొరకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ప్లేయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, రన్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, 1 కె. జి. మెడిసిన్ బాల్ పుట్, 800 మీటర్ల రన్, వయసు ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు చెందిన ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు మండల స్థాయి పోటీలలో పాల్గొనాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.