కోవిడ్ మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో కోవిడ్ కారణంగా మృతి చెందిన ప్రైవేటు సెక్యూరిటి గార్డ్(కాంట్రాక్ట్ వర్కర్)సామల రామ్మూర్తి కుటుంబానికి సోమవారం గోలేటిలోని జిఎం కార్యాలయంలో ఏరియా జిఎం జి.దేవేందర్ 15 లక్షల చెక్కును అతని భార్య నర్మదకు అందించారు.సామల రామ్మూర్తి బెల్లంపల్లి ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటి గార్డ్ గా పనిచేస్తూ కోవిడ్ కారణంగా 2021 మే1న మృతి చెందాడు.దీంతో సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ వర్కర్స్ కు కోవిడ్ ఎక్ష్ గ్రేషియా ను వర్తింప చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది.ఈసందర్భంగా జిఎం దేవేందర్ మాట్లాడుతూ ఎక్స్గ్రేషియా డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసుకొని పిల్లల చదువుల కోసం పొదుపుగా వినియోగించు కోవాలని సూచించారు.కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం మచ్చగిరి నరేందర్,టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు,సెక్యూరిటి మేనేజర్ వరప్రసాద్,డీజీఎం(ఎఫ్ అండ్ ఏ)రామారావు,పర్సనల్ మేనేజర్ ఐ.లక్ష్మన్ రావు,టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి గడ్డం రవిందర్ తదితరులు పాల్గొన్నారు.