కొమరం భీం జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయండి.
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులుగౌడ్.

కొమరం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించినట్లు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు.ఈసందర్భంగా కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 7 లక్షల జనాభా కలిగి ఉన్నదని,50 శాతం ఆదివాసి గిరిజనులు ఉన్నటువంటి కొమరం భీం జిల్లా ఆర్థికంగా వెనుకబడిన జిల్లా అని,ఆసిపాబాదులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులకు సెంట్రల్ సిలబస్ లో బోధన లభిస్తుందన్నారు.ప్రైవేటులో చదివిపించే స్తోమత లేనివారు చాలామంది జిల్లాలో ఉన్నారని,ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లయితే నాణ్యమైన విద్య అందడంతో విద్యార్థులు ఉన్నతులుగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు.వినతి పత్రం అందించిన వారిలో ఖైర్ గూడెం సర్పంచ్ అజ్మీర సంధ్యారాణి.బిజెపి రెబ్బెన మండల ప్రధాన కార్యదర్శి జగన్నాథ ఓదేలు,చవాన్ అంబాదాస్ తదితరులు పాల్గొన్నారు.