కేటీఆర్ తో ఎమ్మెల్యే జోగు రామన్న

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగ నిరతిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించగా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. పురపాలక, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పథకాలకు శ్రీకారం చుడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతి పాటు పడుతోందని పేర్కొన్నారు.