కేంద్రం పథకాలను మా పథకాలు అని చెప్పుకునే ప్రభుత్వం బిఆర్ఎస్

ఎంపీ సోయంబాపురావు

బోథ్‌: కేంద్రం పథకాలను మా పథకాలు అని చెప్పుకునే ప్రభుత్వం బిఆర్ఎస్ అని ఎంపీ సోయంబాపురావు అన్నారు. బోథ్ నియోజక వర్గంలో ఉన్న భోస్ర లో సిసి రోడ్డు భూమి పూజ చేశారు.అంతరం గిర్నూర్ లోని శబరిమాత మందిరం నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుండి రూ;3 లక్షలు, యాదవ సంఘం వారికి రూ;5 లక్షలు,అలాగే భోస్రలో సీసీ రోడ్లకు రూ,7లక్షలు మంజూరు చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ మన దేశం ఆధ్యాత్మికంగా ఉండటం వల్లనే మనం ముందుకు వెళ్తుతుందంటే అది మోడీ మన దేశానికి ప్రధాని అవ్వడం వల్ల బీజేపీ ఇచ్చే రేషన్, సీసీ రోడ్లు,పథకాలన్నీ ఇవి మవే అని చెప్పుకునే ప్రభుత్వం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రం లో ప్రతి ఇంటిలో ఒక ఉద్యోగం లేదు, డబుల్ బెడ్రూం ఇల్లు లేదు, కానీ ఇంటికో గొఱ్ఱె ను మాత్రం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకుడు గొర్ల రాజు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి ఉండి కూడా మనకు మోసం జరుగుతుంది అని అన్నారు. గొర్ల ఎంపిక సరిగా లేదు. మునుగోడు లో ఎన్నికలకంటే ముందు యాదవులకు గొర్ల పంపిణీ డబ్బులు నగదును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా ల్లో జమ ఉంచి ఎన్నికలు అవగానే ప్రిజ్ చేసి డబ్బులు లేవకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిన తీరు మర్చిపోవద్దన్నారు. ఇలాంటి మోసం చేసే వారిపట్ల యాదవులు కల్సి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు.మండల నాయకులు ఓబీసీ నాయకుడు కేవల్ సింగ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్,ఎంపీటీసీ గజానంద్, బత్తిని సుధాకర్, సర్పంచులు కృష్ణ,శ్రీరామ్,శబరి మాత భక్తులు,యాదవ సంఘం వారు అభిమానులు పాల్గొననారు.

Leave A Reply

Your email address will not be published.