కార్మికులను భయ భ్రాంతులకు గురి చేస్తే ఊరుకునేది లేదు:

బీఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ కార్యదర్శి సోయం రాందాస్

ఇంద్రవెల్లి: గ్రామ పంచాయతీ కార్మికుల చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని బీఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ కార్యదర్శి సోయం రాందాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేస్తున్న సమ్మెను స్థానిక సర్పంచ్,పంచాయతీ కార్యదర్శి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సమ్మెను విడి కార్మికులు ఉద్యోగాల్లో చేరకపోతే ఉద్యోగాల నుండి తీసేస్తామని భయ భ్రాంతులకు గురి చేయడం సరికాదని అన్నారు.కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఎస్పీ పార్టీ సంపూర్ణ మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం మండల ఎంపిడివో,ఎస్సై ,గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు పేందుర్ అంకుష్, ఖానాపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వావల్కర్ శివాజీ,అర్పీఐ మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే బాబాసాహెబ్, బీఎస్పీ మండల కన్వీనర్ సోన్ కాంబ్లే సునీల్, సీఐటీయు మండల అధ్యక్షురాలు కత్తి మల్లమ్మ, సీనియర్ నాయకులు జొందలే విజయ్, మురారి, దీపక్, కొండిబా, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.