కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పాలి..

ఎమ్మెల్యే జోగు రామన్న,రాథోడ్ బాపూరావు

ఆదిలాబాద్: సీఎం కేసీర్ రైతుల ఆత్మగౌరాన్ని కాపాడే దిశగా ఔర్ ఏక్ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో స్ఫూర్తినిస్తా ఉంటే అదే కిసాన్ రైతుల పట్ల రేవంత్ రెడ్డి విషం చిమ్మడం ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యేజోగు రామన్న అన్నారు. కష్టపడే రైతుల పట్ల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనీస కనికరం లేకుండా రైతులకు ఉచిత కరెంట్ అవసరమా అంటూ ఎద్దెవా చేసే మాట్లాడటాన్ని నిరసిస్తూ నేడు బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే జోగు రామన్న గారు ముఖ్యఅతిథిగా పాల్గొని కాంగ్రెస్ రైతుల పట్ల చేస్తున్న కుట్ర పూరిత చర్యలను వివరించారు.. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరితిసి జాతీయ రహదారిపై దగ్ధం చేసి నిరసనను వ్యక్తం చేశారు… అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తూ,అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులను అవమానించి మాట్లాడటం జరుగుతుందన్నారు.రేవంత్ రెడ్డి మనసులోని మాట ను తనకు తానే బయట పెట్టుకొని అడ్డంగా దొరికిపోయాడన్నారు. 70% ఉన్నటువంటి రైతాంగాన్ని కాంగ్రెస్ నేతలు ఇలా అవమానించి మాట్లాడటంతగదని,రైతుల మీద విషం చిమ్మడం బి ఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతుకు అండగా ఉంటుందన్నారు.కాంగ్రెస్ నాయకులు రైతుల పట్ల ఎంత అమానుషంగా మాట్లాడినప్పటికీని బిజెపి నాయకులు రైతుల పక్షాన నిలబడి నిరసన కార్యక్రమాలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. దీని ద్వారా బీ టీమ్ పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ఔర్ ఏక్ బార్ కిసాన్ సర్కార్ అంటూ రైతాంగని స్ఫూర్తినిస్తా ఉంటే. చత్తీస్గడ్ మహారాష్ట్రలో నాయకులు బి ఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతో పార్టీ పటిష్టతను పెంచుకుంటున్న తరుణంలో అసత్యపు ప్రచారాలు మోసపూరిత ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీఅబద్ధాలు మాట్లాడటం జరుగుతుందన్నారు.రైతులని అవమానించినందుకు కాంగ్రెస్ పార్టీ పార్టీ భారత దేశ రైతులకు క్షమాపణ చెప్పేంతవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉదృతం చేస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ , వైస్ చైర్మన్ జెహిర్ రంజాని, పట్టణ అధ్యక్షుడు అజయ్,బోథ్ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రైతు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రలాద్, సాజి తోద్దీన్,,ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, శివకుమార్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.