కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ కుట్రలు
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ధ్వజం

ఆదిలాబాద్ః తెలంగాణలో కాంగ్రెస్‌కు రోజురోజుకూపెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే అధికార బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను ఉరివేసి దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్‌లో రేవంత్ ఫ్లెక్సికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిందని, అధికారంలోకి వచ్చాక తిరిగి సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ జెండా ఎరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు ఎమ్మెల్యే జోగు రామన్న ఉరివేయడం కాదు..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ఇదే ఎన్టీఆర్ చౌక్‌లో స్వయంగా ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఘాటుగా వ్యాఖ్యనించారు. పేరుగొప్ప ఊరుదిబ్బలాగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెబుతోందని, కానీ వాస్తవానికి 8 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్‌ను అందించలేకపోతోందని ఆరోపించారు. అనధికారిక కోతలు విధిస్తూ రైతులను ఇబ్బందులపాలు జేస్తోందన్నారు. అధికారంలో ఉన్నవారే రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్, డిస్ట్రిక్ట్ మైనారిటీ సెల్ చైర్మన్ షకీల్, సాత్నాల ప్రాజెక్ట్ చైర్మన్అల్లూరి అశోక్ రెడ్డి ఐ.ఎన్. టి. యూ. సి డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కొండూరి రవి,ఎంపీటీసీ మనోజ్, మానే శంకర్ , రాజ్ మొహమ్మద్ , గేడం అశోక్, ప్రభాకర్, షేక్ మన్సూర్ , సమి ఉల్లా ఖాన్, వసీమ్ రంజాని, షేక్ సలీం, రవీందర్ రెడ్డి, అస్బాత్ ఖాన్, దర్శనాల చంటి, షేక్ ఖయ్యుమ్, అయ్యుబ్ ఖాన్, ఎల్మా రామ్ రెడ్డి, షేక్ షాహిద్, పోతారాజు సంతోష్, ఉగ్గె సంతోష్, మోసిన్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.