కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తా..

ధర్మ సమాజ్ పార్టీ అదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అగ్గిమల్ల గణేష్ మహారాజ్

అదిలాబాద్: జిల్లా కళాకారులకు సమస్యల పరిష్కారం ఉద్యమిస్తామని, ఎల్లవేళలా అండగా ఉంటానని ధర్మ సమాజ్ పార్టీ అదిలాబాద్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అగ్గిమల్ల గణేష్ మహారాజ్ అన్నారు.గురువారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సత్య డాన్స్ అకాడమీలో అదిలాబాద్ జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ & జిల్లా డాన్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం చేశారు. డాన్స్ మాస్టర్ గా కళా కారుడుగా సామాజిక సేవలు అందించిన అగ్గిమల్ల గణేష్ కు ధర్మ సమాజ్ పార్టీ టికెట్ రావడం పై హర్షం వ్యక్తం చేస్తూ వారు సన్మానించారు. శాలువ పూల,మాలలు ,పుష్పగుచ్ఛాలు అందించి ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఏళ్లుగా సేవలు చేస్తున్న కళాకారులకు గుర్తింపు, ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహం లేదని వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని అన్నారు. అనంతరం డాన్స్ స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షుడు బీమేష్, డాన్స్ మాస్టర్ లు సతీష్,అమూల్,చిట్టి మాస్టర్ లు మాట్లాడుతూ16 ఏళ్లుగా కలిసి మెలిసి పేద కుటుంబం నుండి వచ్చిన గణేష్ ,ఎన్నో సామాజిక పోరాటాలు, సామాజిక సేవ కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పై నిరంతరం పోరాడే యువ నాయకుడిని ప్రజలంతా కలిసి గెలిపించు కోవాలని కోరారు. వ్యక్తిత్వం ,నాయకత్వ ,గుణం,నీతి నిజాయితీ గల నాయకుడి కి అండగా ఉంటామని, ఆయన గెలుపు కోసం పని చేస్తామని చెప్పారు..ఇందులో జిల్లా డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నేవర్ భీమేష్, జిల్లా డాన్స్ అసోసియేషన్ మాస్టర్లు గజానన్ గౌడ్,సత్య మాస్టర్,అమూల్ మాస్టర్,చిట్టి మాస్టర్,మ్యాగీ మాస్టర్,ప్రవీణ్ మాస్టర్,మహేష్,సాగర్,ప్రశాంత్ మాస్టర్ లు, DSP నాయకులు సంతోష్, కీపర్ గంగన్న లు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.