కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

ఆదిలాబాద్ : కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ కార్యకర్తలు కొత్తగా పార్టీలో చేరేవారితో సందడిగా మారుతోంది. వివిధ గ్రామాలనుండి ,పట్టణంలోని కాలనీల నుండి తరలివచ్చి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ఇవాళ గాంధీనగర్ ,బంగారిగూడ కాలనీలనుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలకు కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. వారంతా జోగురామన్న పాలనలో చాలా ఇబ్బందులు పడుతున్నామని అందుకే కాంగ్రెస్ లో చేరామని తెలిపారు.కాలనీలలో కనీసం తాగటానికి నీళ్లు కూడా లేవని ఇదేనా నీ అభివృద్ధని జోగురామన్న పై కంది శ్రీనివాస రెడ్డి విరుచుకుపడ్డారు.14ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఏం చేసావని ప్రశ్నించారు. తానువచ్చిన తరువాతనే జోగురామన్నలో వణుకు మొదలైందన్నారు. ఈసారి ఖచ్చితంగా జోగురామన్నను చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతారని తేల్చి చెప్పారు. ఆయన పాలనలో పేదకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే జరిగే అభివృద్ధిని మహిళలకు వివరించారు. ఈసారి కాంగ్రెస్ కుఒక్క అవకాశమివ్వాలని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతీకార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈదఫా అందరూ కష్టపడి పార్టీని గెలిపించాలని కోరారు.