కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో భారీ చేరికలు

ఆదిలాబాద్ : కాంగ్రెస్ రాష్ట్రనాయకులు కంది శ్రీనివాస రెడ్డి ప్రజా సేవాభవన్ లో నిత్యం సందర్శకుల సందడి కనిపిస్తోంది.నియోజక వర్గంలోని పలు ప్రాంతాల నుండి తరలివస్తున్న ప్రజలు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పట్టణంలోని ఖానాపూర్ కాలనీ నుండి పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కండువా కప్పి కంది శ్రీనివాస రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మనమంతా రాహుల్ గాంధీ ,రేవంతన్న నాయకత్వంలో కార్యకర్తలు గా పని చేసి పార్టీని గెలిపించాలని కంది శ్రీనివాస రెడ్డి కోరారు. ఎంత మంది నాయకులు వచ్చినా తనను నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు.పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్ర స్థాయిలో పని చేయాలని కోరారు