కంది శ్రీనివాస రెడ్డి భారీ విరాళం

ఆదిలాబాద్ : యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ పోరాట యాత్రకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. తనవంతుగా లక్ష రూపాయల విరాళం అందించి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మావల వద్ద నుండి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీలో యువత వేలాదిగా పాల్గొని ఓల్డ్ బస్టాండ్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గీమ్మ సంతోష్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్,జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ షకీల్,తహేర్ తదితరులు పాల్గొన్నారు.