కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో చేరికల జోరు

ఆదిలాబాద్ : కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ నిత్యం ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల రాకతో సందడిగా మారుతోంది. కంది శ్రీనివాస రెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ,నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యేజోగు రామన్నను ప్రశ్నిస్తున్నతీరు ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం ఆయన పడుతున్న తపన చూసి జనం మేము సైతం నీవెంటే అంటూ కదిలివస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాలనుండి ప్రతీ రోజు ప్రజా సేవాభవన్ కు తరలివస్తున్నారు.గ్రామాల పర్యటనలో కంది శ్రీనివాస రెడ్డి బిజీ గా ఉన్నా ఆయన వచ్చేవరకు వేచి ఉండి కంది శ్రీనన్న సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. బేల మండలం దుబ్బగూడ నుండి సీనియర్ కంగ్రెస్ నాయకులు రాజ్ మహమ్మద్ , మాజీ సర్పంచ్ ,పటేల్ ల ఆధ్వర్యంలో వచ్చిన పలువురు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణంలోని ఇందిరానగర్ నుండి కూడా పలువురు యువకులు ఆయన సమక్షంలో కంగ్రెస్ లో చేరారు. వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోడు పట్టాల విషయంలో గిరిజనులకు జోగురామన్న అన్యాయం చేస్తున్నారని కంది శ్రీనివాస రెడ్డి విమర్శించారు.పోడు రైతులకు మొత్తం భూమికి హక్కు పత్రలివ్వాకుండా కేవలం కొన్ని గుంటలకే పరిమితం చేస్తూ పట్టాలిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే జోగురామన్న ఆదివాసులకు ప్రభుత్వ ఫలాలు దక్కకుండా చేస్తున్నారని దుబ్బగూడ వాసులు ఆవేదన వ్యక్తం చేసారు.ఇలాంటి ఎమ్మెల్యేను ఓడించాలని కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గీమ్మ సంతోష్, డిస్ట్రిక్ట్ మైనారిటీ సెల్ చైర్మన్ షకీల్, రాజ్ మొహమ్మద్ ,మన్సూర్, మానే శంకర్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.