కంది శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

ఆదిలాబాద్ : భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ తో కలిసి అమెరికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని మొదటి సారి ఆదిలాబాద్ కొచ్చిన సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి స్వాగతం పలికారు. జై కంది శ్రీనివాస రెడ్డి ,కాబోయే ఎమ్మెల్యే కంది శ్రీనన్న నినాదాలతో హోరెత్తించారు. అనంతరం శాలువాతు పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. జైనథ్ ,ఆదిలాబాద్ రూరల్ మండలాలనుండి వచ్చిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారందరికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కంది శ్రీనన్నను ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు కొత్తగా పార్టీలో చేరినవారు.కాంగ్రెస్ పార్టీ హామీలతో కూడిన పాకెట్ సైజ్ కార్డులను కార్యకర్తలతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న అవినీతి పాలన పై కంది శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. ఇన్నేళ్లలో ఆదిలాబాద్ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.జోగు రాక్షస పాలన అంతమొందించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పేదల ఆకలితీర్చే పార్టీ అన్నారు.మీ ఆశీర్వాదం కోసం వస్తున్న ఒక్కసారి గెలిపించమని కోరారు. తనవెంటున్న కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలని అన్నారు. అందరిని కలుపుకుపోయి పార్టీని గెలిపించుకుంటామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే 2లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అందుకే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 10 లో 8 సీట్లు ,తెలంగాణా వ్యాప్తంగా 75 నుండి 80 సీట్ల వరకు తమ పార్టీ తప్పకుండా గెలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేసారు.