ఔట్ సోర్స్ ఉద్యోగుల సేవా కార్యక్రమాలు అభినందనీయం

ఆదిలాబాద్:తొమ్మిది సంవత్సరాల అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన మార్పు సాధించిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియం లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రిమ్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు స్వచ్చందంగా రక్తదానం చేయగా వారిని అభినందించి పండ్ల రసాలను అందచేశారు.ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండేలా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని అన్నారు.అన్నిజిల్లకేంద్రాల్లోనూ మెడికల్ కళాశాలలను మంజూరు చేసుకుని వైద్యుల కొరత రాకుండా ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు