ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

మండల ఆదివాసి నాయక పోడు సేవా సంఘం మండల అధ్యక్షులు దేవర పోచ్చన్న

తలమడుగు: ఐక్యతతోనే సమస్యల పరిష్కారం చేసుకోవచ్చని తలమడుగు మండల ఆదివాసి నాయక పోడు సేవా సంఘం మండల అధ్యక్షులు దేవర పోచ్చన్న అన్నారు మంగళవారం మండలంలోని సాయి లింగీ గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జయంతి విశ్వరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అల్లూరి సీతారామ రాజు స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని కోరారు అదేవిధంగా మండలంలోని ప్రతి ఒక్క నాయ క పోడు కులస్తులకు ఏ సమస్యలున్నా ఐక్యంగా ఉండి పరిష్కరించుకోవాలని సూచించారు అదేవిధంగా మండలంలో గల భీమన్న దేవాలయాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు ఇందులో సంఘము నాయకులు కాంతారావు మాజీ సర్పంచ్ దంతే రమేష్ మాజీ ఎంపిటిసి నాగయ్య మాజీ ఎంపిటిసి సుంకిడి భీమన్న లింగి సర్పంచ్ జంగాల పోచన్న అర్లి సర్పంచ్ నారా కిష్టన్న నారా వెంకన్న నీలగిరి అశోక్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.