ఎస్.టి. హోదా జీవో కోసం మాలీలు ఎదురుచూపులు
అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే

ఆదిలాబాద్ ముఖ్యమంత్రి కేసీఆర్ 30వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి రానున్న సందర్భంగా ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి ఎస్టి హోదా జీవో కోసం మాలికులస్తులు ఎదురుచూస్తున్నారని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసి మాలీలకు ఎస్టీ హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారని ముఖ్యమంత్రి ఇంకో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో అమలవుతున్న 10% గిరిజన రిజర్వేషన్లలో మాలీలకు చోటు కల్పిస్తూ జీవో విడుదల చేసి ఎస్టి హోదా కల్పిస్తున్నట్లు అత్యధిక మాలి కులస్తుల జనాభా కలిగిన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. 9% గిరిజన జనాభా ఉన్న తెలంగాణలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నెరవేర్చి 10% గిరిజన రిజర్వేషన్లలో మాలీలకు చోటు కల్పిస్తూ జీవో విడుదల చేసి ఈ ఎన్నికల ముందే మాలిలకు ఎస్జీ హోదా కల్పించి సామాజిక న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఉమ్మడి జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప జోగు రామన్న రాథోడ్ బాబూరావులు ముఖ్యమంత్రి పై ఒత్తిడి పెంచి మాలిలకు ఎస్టీల హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది మాలికులస్తులు పోడు భూములను సాగు చేస్తూ పట్టాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎస్టీ హోదా కల్పిస్తే వారు కూడా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు వచ్చి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా ఎదగగలుగుతారని అన్నారు.