ఎస్టి హోదా సాధించేదాకా పోరాటం ఆగదు

మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేటకులే

త‌ల‌మ‌డుగు: ఐక్యపోరాటాల ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి ఎస్టి హోదా సాధించుకుందామని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. బుధవారం తలమడుగు మండలం బరంపూర్ లో మాలి పటేళ్ల సంఘ సమావేశానికి హాజరై ప్రసంగించారు. గ్రామ అధ్యక్షులు, మాలి పటేళ్లు మాలిలను ఏకతాటిపైకి తేవాలని సంఘటితంగా ఉంటేనే కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు మాలీలకు ఎస్టీ హోదా విషయమై తీర్మానం చేస్తారని,గత 22 సంవత్సరాల పోరాటానికి అప్పుడే న్యాయం జరిగి ఎస్టి హోదా లభించి మాలిలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకెళ్లగలుగుతారని అన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న సేండే కుచులాపూర్ మహాజన్ విలాస్ సెండే, బరంపూర్ మహాజన్ వినోద్ గురునులే, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అంబేకర్ చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట్రంగే అనిల్, ఉత్తం మాందాడే, రమేష్ గురునూలే తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.